మహిళా MLAలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలి: హైకోర్ట్

29చూసినవారు
మహిళా MLAలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలి: హైకోర్ట్
TG: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని ఆదేశించింది. సదరు పోలీసుల వివరాలను స్పీకర్‌కు ఇవ్వాలని డీజీపీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ ఘటన అసెంబ్లీ వద్ద జరిగినట్లయితే ఆ వివరాలను హైకోర్టుకూ నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్