మాదాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

18చూసినవారు
మాదాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాదాపూర్, కూకట్‌పల్లి జోన్ SOT పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో జరిగిన ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడితో పాటు నలుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 1,48,970 నగదు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్