TG: హైదరాబాద్ షాలిబండలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా క్యాబ్ దొరక్క ఇబ్బంది పడిన ఓ గర్భిణీ మహిళకు హుస్సేని ఆలం పోలీసులు మానవత్వం చాటుకున్నారు. వెంటనే స్పందించి, పోలీసు వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గర్భిణీకి తోడుగా మహిళా కానిస్టేబుల్ను కూడా పంపించారు. పోలీసుల సకాలంలో సహాయంతో ఆ మహిళ ఆసుపత్రికి చేరుకోగలిగింది. ఈ చొరవపై పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి.