
ఇటలీలో పెళ్లి చేసుకుంటే భారీ నగదు బహుమతి!
ఆధునిక యువత పెళ్లి, పిల్లలను కనడాన్ని భారంగా భావిస్తున్న నేపథ్యంలో, ఇటలీ దేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2024లో అత్యల్ప జననాల రేటు నమోదైంది. దీనిని పరిష్కరించేందుకు, ఇటలీ ప్రభుత్వం వివాహం చేసుకునే యువతకు గ్రామీణ పునరావాస గ్రాంట్ కింద 30 లక్షల రూపాయల వరకు, నెలవారీ స్టైపెండ్లు, వ్యాపార మద్దతు, పన్ను రాయితీలు, డిజిటల్ నోమాడ్ వీసాలు వంటి ప్రోత్సాహకాలను ప్రకటించింది.




