ఢిల్లీలో కాలుష్యం.. ఆంక్షలు కఠినతరం

12581చూసినవారు
ఢిల్లీలో కాలుష్యం.. ఆంక్షలు కఠినతరం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. శనివారం ఉదయం ఏక్యూఐ 359గా నమోదై, ఎక్కువ ప్రాంతాల్లో ‘పూర్’ స్థాయికి చేరింది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు 50% ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో ఆరుబయట కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఆదేశాలు సుప్రీం కోర్టు సూచనల ఆధారంగా జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, క్రీడా సంస్థలకు కూడా వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్