పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు: హరీష్ రావు

0చూసినవారు
పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు: హరీష్ రావు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పొంగులేటి మంత్రిలా కాకుండా రాఘవ్ కన్‌స్ట్రక్షన్స్ అధినేతలా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రాఘవ్ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలను సీఎం అసెంబ్లీలో ఒప్పుకున్నారని, దీనిపై నాలుగు శాఖలు విచారణ జరిపి నివేదిక ఇచ్చాయని గుర్తుచేశారు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా తనకు సంబంధంలేదని పొంగులేటి అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని, మరిన్ని అక్రమాలు బయటపెడతామని హెచ్చరించారు. కొత్వాల్‌గూడ మైనింగ్ తనది కాదని 12 రోజుల తర్వాత గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్