అసెంబ్లీ రద్దు సవాలుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటు కౌంటర్

3911చూసినవారు
అసెంబ్లీ రద్దు సవాలుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటు కౌంటర్
తెలంగాణలో అసెంబ్లీ రద్దుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విసిరిన సవాళ్లకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టిగా స్పందించారు. ప్రజలు కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీతో అధికారం ఇచ్చారని, అలాంటిది అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించారు. హరీష్ రావుకు మానసిక సమతుల్యత తప్పిందని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని, ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన శిక్ష వేస్తున్నారని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్