కేరళ రాష్ట్ర అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు అఖిల్ విశ్వనాథ్ (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అఖిల్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 2019లో కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న ‘చోళ’ మువీలో తన పాత్రకుగాను అఖిల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆపరేషన్ జావా’ సహా పలు సినిమాల్లోనూ నటించారు. కాగా ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.