
జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల(M)లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




