కేసు విచారణ మధ్యలో అశ్లీల వీడియోల కలకలం

41చూసినవారు
కేసు విచారణ మధ్యలో అశ్లీల వీడియోల కలకలం
ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ విచారణ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని బెంచ్ ముందున్న విచారణలో ఓ అపరిచితుడు అకస్మాత్తుగా లాగిన్ అయ్యి అశ్లీల వీడియోలు ప్లే చేయడంతో కలకలం రేగింది. వర్చువల్ లింక్‌ను నిలిపివేసినప్పటికీ, అదే వ్యక్తి మళ్లీ మళ్లీ లాగిన్ అవుతూ అంతరాయం కలిగించాడు. దీంతో “హ్యాకింగ్ జరిగింది” అంటూ హెచ్చరికలు వినిపించడంతో కోర్టు విచారణ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ భద్రతా లోపాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్