
మానవత్వం చాటుకున్న అధికారులు.. విరాళాలతో వృద్ధుడి అంత్యక్రియలు
భార్య మరణించి మూడు నెలలైన నేపథ్యంలో, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన చీరాల శ్రీనివాసరావు (60) మరణించారు. మద్యానికి బానిసైన కుమారుడు సురేశ్ కన్నెత్తి చూడకపోవడంతో, అధికారులు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో, పోలీసులు, పంచాయతీ అధికారులు ఆర్థిక సాయం చేసి, పర్చూరు హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.




