పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్: రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.9,250!

46చూసినవారు
పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్: రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.9,250!
కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో వ్యక్తిగత ఖాతాదారులు రూ.9 లక్షల వరకు, జాయింట్ ఖాతాదారులు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం 7.4% వార్షిక వడ్డీ రేటుతో, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.9,250 వరకు వడ్డీ ఆదాయం పొందవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఏడాది తర్వాత ప్రీమెచ్యూర్ క్లోజర్ అవకాశం ఉన్నా, నిర్దిష్ట పెనాల్టీ వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్