పోస్టాఫీస్ స్కీమ్‌: రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు!

64చూసినవారు
పోస్టాఫీస్ స్కీమ్‌: రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు!
పెట్టుబడిపై గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర (KVP) మంచి ఎంపికగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.5% వడ్డీ లభిస్తుండగా, పెట్టిన మొత్తం 115 నెలల్లో (9 ఏళ్లు 7 నెలలు) రెట్టింపవుతుంది. అంటే రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు. గరిష్ఠ పరిమితి లేకుండా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా లేదా జాయింట్ అకౌంట్‌గా తెరవొచ్చు. 2.5 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా సౌకర్యం ఉండగా, అవసరమైతే సర్టిఫికేట్‌పై లోన్ కూడా పొందవచ్చు.

సంబంధిత పోస్ట్