పోస్టాఫీస్ పథకం.. ఒకసారి పెట్టుబడితో నెలనెలా ఆదాయం!

130చూసినవారు
పోస్టాఫీస్ పథకం.. ఒకసారి పెట్టుబడితో నెలనెలా ఆదాయం!
ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, స్థిరమైన ఆదాయం కోసం పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఒక మంచి మార్గం. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల పాటు నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.40% ఉంది. కనీస పెట్టుబడి రూ.1000 కాగా, గరిష్టంగా ఒక వ్యక్తి రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ తర్వాత అసలు మొత్తం తిరిగి వస్తుంది. రిస్క్ లేకుండా ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలమైన పథకం.