TG: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ప్రవళిక కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. కాగా మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.