పంట కోతలు వాయిదా వేసుకోండి.. రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి!

27చూసినవారు
పంట కోతలు వాయిదా వేసుకోండి.. రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి!
TG: రాష్ట్రంలో మురసు తుఫాను ప్రభావం కొనసాగుతున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ నేపథ్యంలో పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలని అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతినకుండా రైతులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. పంట ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లతో భద్రపరుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్