పవర్ బ్యాంక్ వాడితో ఫోన్ బ్యాటరీ జీవితకాలం తగ్గుతుందా?

11057చూసినవారు
పవర్ బ్యాంక్ వాడితో ఫోన్ బ్యాటరీ జీవితకాలం తగ్గుతుందా?
ప్రతిసారీ పవర్ బ్యాంక్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గుతుందని, ముఖ్యంగా ఐఫోన్ యూజర్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ సెల్స్‌పై అధిక ఒత్తిడి పడి, ఛార్జింగ్ వేగం, బ్యాటరీ జీవితకాలం రెండూ తగ్గుతాయి. పవర్ బ్యాంక్‌తో ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ వేడెక్కడం వల్ల అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బ్రాండెడ్, సర్టిఫైడ్ పవర్ బ్యాంక్‌లను వాడాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్