
ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ ఆగ్రహం
యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో చర్చలు విఫలం కావడానికి నెతన్యాహు కారణమని, 'నీకేమైనా పిచ్చా?' అని మండిపడ్డారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ చర్చల నుంచి తప్పుకోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, నెతన్యాహుపై కోపంగా ఉన్నానని, తన వల్లే అతను సురక్షితంగా ఉన్నాడని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఒక యూఎస్ అధికారి తెలిపారు.




