
ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. సినిమా థియేటర్లో మంటలు
ఒడిశాలోని రాయగడలో 'రాజాసాబ్' సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమానుల అత్యుత్సాహం ప్రమాదానికి దారితీసింది. హీరో ప్రభాస్ ఎంట్రీ సీన్ సమయంలో థియేటర్లోనే టపాసులు పేల్చడంతో స్క్రీన్ ముందున్న కాగితాలు అంటుకుని మంటలు చెలరేగాయి. సకాలంలో హాల్ యాజమాన్యం, ప్రేక్షకులు స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.




