
రూ.20 కోసం వృద్ధుడిని గొడ్డలితో నరికి, పరారైన దుండగుడు
TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో కేవలం రూ.20 కోసం శుక్రవారం ఓ వృద్ధుడిని గొడ్డలితో నరికి చంపిన అమానుష ఘటన చోటుచేసుకుంది. కూతురిని రైలు ఎక్కించేందుకు స్టేషన్కు వచ్చిన మసాడి సోమయ్య (65) అనే వృద్ధుడు టీ తాగేందుకు బయటకు రాగా.. బోగారపు నగేష్ అనే వ్యక్తి రూ.20 అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో సోమయ్యను వెంబడించిన నగేష్, గొడ్డలితో దాడి చేసి తల మొండెం వేరు చేశాడు. స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.




