
కాళ్లు, చేతులు లేకున్నా ఆర్చరీలో చరిత్ర సృష్టించిన పాయల్ నాగ్ (వీడియో)
ఒడిశాకు చెందిన పాయల్ నాగ్, ఐదేళ్లకే విద్యుత్ ఘాతంతో కాళ్లు, చేతులు కోల్పోయినా, అనాథాశ్రమంలో పెరుగుతూ ఆర్చరీని ఎంచుకున్నారు. భుజం, నోటి సాయంతో విల్లు ఎక్కుపెట్టి జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె, ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందారు. డిసెంబర్ 7 నుండి 14 వరకు దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచినందుకు శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు బుధవారం పారా ఆర్చర్ పాయల్ నాగ్‌ను సత్కరించింది. వైకల్యం శరీరానికే కానీ ఆశయానికి కాదని ఆమె మరోసారి నిరూపించింది.




