
భారత్ స్వయం శక్తిగా అవతరించింది: పుతిన్
ప్రపంచ దేశాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. భారత్-రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవని, ఎవరికీ వ్యతిరేకం కాదని పుతిన్ ప్రకటించారు. అమెరికా రష్యా చమురు కొనకుండా ఆపమని చెబుతుంటే, వారు తమ అణు ఇంధనాన్ని కొంటున్నారని పుతిన్ తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా రష్యాతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కొనసాగిస్తోందని, భారత్ స్వయం శక్తిగా అవతరించిందన్నారు.




