
ఛత్తీస్‌గఢ్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు!
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో కోట్మి సోనార్, జైరాంనగర్ స్టేషన్ల మధ్య ఒకే ట్రాక్‌పై రెండు గూడ్స్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు కదులుతున్నప్పుడు ముందు, వెనుక నుంచి గూడ్స్ రైళ్లు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. లోకోపైలట్ చాకచక్యంగా రైలును ఆపడంతో ప్రమాదం నివారించబడింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగా ఈ ఘటన జరిగినట్లు రైల్వేశాఖ తెలిపింది.




