రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాజా సాబ్' డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇక, ప్రభాస్ తదుపరి చిత్రం 'స్పిరిట్' పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. రేపటి నుండి ప్రభాస్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటాడు. ముందుగా జైలు సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో త్రిప్తి దిమిరి హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు.