
గుడిలో కార్తీకదీపం అంటుకొని బాలిక సజీవ దహనం
AP: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలానికి చెందిన గొల్ల సుబ్బన్న, సులోచన దంపతుల కుమార్తె రేవతి (8) తన తల్లితో కలిసి శివాలయంలో కార్తీక దీపం వెలిగించేందుకు వెళ్లింది. దీపం వెలిగించిన తర్వాత ఆ మంట రేవతి దుస్తులకు అంటుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి ఆమె తీవ్రంగా కాలిపోయింది. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆదివారం పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.




