దిమ్మతిరిగే రేంజ్‌లో రాజాసాబ్‌ బిజినెస్

6857చూసినవారు
దిమ్మతిరిగే రేంజ్‌లో రాజాసాబ్‌ బిజినెస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూసుకుపోతోంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.130 కోట్లకు పైగా డీల్ కుదిరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, లాభాల్లోకి రావాలంటే రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.