TG: ఇకపై ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్ కు గంటన్నర సమయం ఇస్తారు. మరో 15 మార్కులు సెకండియర్‌లో ఉంటాయి. థియరీకి 60 మార్కులు కేటాయించారు. జూనియర్ కాలేజీలు తప్పకుండా ఈ విధానాన్ని అమలు చేయాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు చోటివ్వొద్దని హెచ్చరించింది.