TG: ప్రజావాణిని ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి సేవలను దశలవారీగా రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయికి విస్తరించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పురోగతిని అర్జీదారులకు తెలియజేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిష్కారం కాని ఫిర్యాదులు పైస్థాయికి ఆటో ఎస్కలేషన్ ద్వారా చేరే విధానం అమలు చేయాలని, అవసరమైతే అప్పీల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని సూచించారు.