
ప్రేమ పేరుతో వంచన.. బాలికను తల్లిని చేసిన యువకుడు
AP: కడపలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న 17 ఏళ్ల బాలికను అదే కాలేజీలో సీనియర్‌గా చదువుతున్న యువకుడు ప్రేమ పేరుతో మోసగించి తల్లిని చేశాడు. గురువారం ఆ బాలిక ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గర్భం విషయం హాస్టల్ నిర్వాహకులు గుర్తించకపోవడం ఆశ్చర్యంగా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




