ఆరు కి.మీ. నడవడంతో అస్వస్థతకు గురై గర్భిణి మృతి

0చూసినవారు
ఆరు కి.మీ. నడవడంతో అస్వస్థతకు గురై గర్భిణి మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆశా సంతోష్‌ కిరంగ.. ప్రసవం కోసం ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లడంతో రక్తస్రావం జరిగి కడుపులోని బిడ్డతో పాటు ఆమె కూడా మృతి చెందింది. సరైన వైద్య, రవాణా సదుపాయాలు లేకపోవడమే ఈ విషాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ ప్రతాప్‌ షిండే, వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేదని తెలిపారు. అధికారులు విచారణకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్