చలికాలంలో దాహం తగ్గినా, గర్భిణీలు రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటి శాతం తగ్గితే అమ్నియోటిక్ ద్రవం తగ్గి, శిశువుకు ప్రమాదం, సిజేరియన్ అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూరినరీ ఇన్ఫెక్షన్లు, అమ్నియోటిక్ బ్యాండ్ సిండ్రోమ్, అకాల ప్రసవం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని పేర్కొంటున్నారు.