అభిమానులకు పంజాబ్ జెర్సీలను అందించిన ప్రీతి జింటా

1711చూసినవారు
అభిమానులకు పంజాబ్ జెర్సీలను అందించిన ప్రీతి జింటా
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయినప్పటికీ, జట్టు సహ యజమాని, నటి ప్రీతి జింటా ఆటగాళ్లను ఆప్యాయంగా పలకరించారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ప్రతి క్రీడాకారుడిని వ్యక్తిగతంగా కలిసి అభినందించారు. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలోని అభిమానులకు పంజాబ్ జెర్సీలను అందించారు. ఆమె ఆటగాళ్లతో, అభిమానులతో సరదాగా గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్