తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.