రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.