
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన ధోనీ.. వీడియో వైరల్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సమీపంలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో పవర్ఫుల్ సూపర్‌బైక్‌ను నడిపి అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక ప్రముఖ టైర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ, హై-పెర్ఫార్మెన్స్ సూపర్‌బైక్‌పై పలు ల్యాప్‌లను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆయన బైక్ కంట్రోల్, కాన్ఫిడెన్స్ చూసి రేసర్లు, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. హెల్మెట్ తీయగానే అభిమానుల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.




