AP: ఉల్లి, టమాటా ధరల పతనంతో రైతులకు అపార నష్టం వాటిల్లుతోంది. ఎకరా విస్తీర్ణంలో టమాటా సాగుకు రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. ఒక ఎకరాలో ఏడు కోతలకు కలిపి ఏడు వేల కిలోల వరకూ దిగుబడి వచ్చినా కిలో రూ.2 లెక్కన రైతుకు రూ.14 వేలు మాత్రమే దక్కుతుంది. ప్రస్తుత ధరను బట్టి రూ.36 వేల వరకూ నష్టం వస్తోంది. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చవుతోంది. గతేడాది క్వింటా రూ.6వేలు ఉండగా, ప్రస్తుతం క్వింటా రూ.30 పలుకుతోంది. ఉల్లి దిగుబడి ఉన్నా.. రాబడి లేదని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.