తగ్గనున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఉత్పత్తుల ధరలు

10279చూసినవారు
తగ్గనున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఉత్పత్తుల ధరలు
GST సంస్కరణల నేపథ్యంలో తమ పాల ఉత్పత్తుల ధరలను ఈనెల 22 నుంచి తగ్గిస్తామని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది. యూహెచ్‌టీ పాల ధరను లీటర్‌కు రూ.3 చొప్పున తగ్గించింది. లీటరు నెయ్యికి రూ.50, కిలో వెన్నకు రూ.50 చొప్పున తగ్గించింది. చీజ్‌ ధర కేజీకి రూ.50, పన్నీర్‌ కేజీకి రూ.25 మేర చౌక కానున్నాయి. ఐస్‌క్రీమ్‌ 950MLపై రూ.35, 700MLపై రూ.20 చొప్పున తగ్గించింది. ధరల తగ్గింపు వినియోగదారులకు లబ్ధి చేకూర్చనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్