గుడిలో సౌండ్ ఎక్కువ పెట్టాడని పూజారిపై దాడి(వీడియో)

16710చూసినవారు
గుడిలో భక్తి పాటల సౌండ్ ఎక్కువ పెట్టాడని పూజారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. ఇక్కడి శివాలయంలో రామకృష్ణ అనే పూజారి భక్తి పాటలు పెట్టారు. అయితే సౌండ్ ఎందుకు ఎక్కువగా పెట్టారని ఆరోపిస్తూ హరీశ్, దేవాంశ్ అనే వ్యక్తులు పూజారితో గోడవకు దిగారు. ఈ క్రమంలోనే రామకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్