అమ్మవారికి పూజ చేస్తూ.. కుప్పకూలిన అర్చకుడు

13చూసినవారు
అమ్మవారికి పూజ చేస్తూ.. కుప్పకూలిన అర్చకుడు
AP: పండగ వేళ నెల్లూరు జిల్లాలోని నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది. విజయదశమి సందర్భంగా అర్చకుడు సురేశ్ స్వామి ఆలయంలో అమ్మవారికి పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. దాంతో స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సురేశ్ స్వామి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్