ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో ఆయన పాల్గొంటారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన ప్రధాని మోదీ, తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఈ ఏడాది G20 నాయకుల సదస్సును దక్షిణాఫ్రికా నిర్వహిస్తోంది. గ్లోబల్ సౌత్‌లో G20 సదస్సు జరగడం ఇది వరుసగా నాల్గవసారి.