తెలంగాణ అభివృద్ధికి ప్రధాని
మోదీ సహకరించడం లేదని, RRRకు టెండర్ల సమయానికి కేంద్రం అనుమతులను అడ్డుకుందని సీఎం రేవంత్ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కాన్క్లేవ్లో మాట్లాడుతూ.. 'నార్త్ వర్సెస్ సౌత్ కాదు గుజరాత్ వర్సెస్ దేశం అన్నట్లుగా ఉంది. యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న
మోదీ నిధులు గుజరాత్‌కు మళ్లిస్తున్నారు. డీలిమిటేషన్లో జనాభా మేరకు సీట్లు పెంచితే పెద్ద రాష్ట్రాలకు మేలు, చిన్న రాష్ట్రాలకు నష్టం. మేము పేదల వైపు ఉంటే
బీజేపీ సంపన్నుల వైపు ఉంది' అని విమర్శించారు.