ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే మలేషియాలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భేటీ కానున్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరుదేశాధినేతలు మొదటిసారి కలుసుకోనున్నారు. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యలు, భారత్ పై అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అక్టోబర్‌లో ఈ సమావేశం జరగనుంది.