ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలో భాగంగా జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు జోర్డాన్ ప్రధాని ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం, ప్రధాని ప్రవాస భారతీయులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.