ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా సేవా పక్వాడ

14173చూసినవారు
ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా సేవా పక్వాడ
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని అయిన మోదీ, కీలక రాజకీయ మలుపులు తిప్పిన నాయకుడిగా నిలిచారు. ఈ సందర్భంగా బీజేపీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా "సేవా పక్వాడ" కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రజల్లో సేవాభావం పెంపు, పథకాల అవగాహన, స్వదేశీ ప్రోత్సాహం, పర్యావరణ-ఆరోగ్యంపై దృష్టి వీటి లక్ష్యంగా పార్టీ తెలిపింది.