ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరత నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్ 126వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ, 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు స్వయంసమృద్ధి తప్పనిసరి అని, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని ఆయన కోరారు. మహాత్మాగాంధీ స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన కల్పించారని, గత 11 ఏళ్లుగా ఖాదీ ఉత్పత్తి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.