దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ తగ్గింపు తర్వాత పరిస్థితులను తన లేఖలో ప్రధాని మోదీ వివరించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ఈ పండుగ సీజన్‌లో 'జీఎస్టీ బచత్ ఉత్సవ్' జరుపుకుందామన్నారు. తక్కువ జీఎస్టీ వల్ల ప్రతి ఇంట్లో ఎక్కువ పొదుపు జరుగుతుందని, వ్యాపారులకు ఎక్కువ సౌలభ్యం ఉంటుందని ప్రధాని అన్నారు. కాగా జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమలైన విషయం తెలిసిందే.