ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం భూటాన్ చేరుకున్నారు. థింపులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా భారత్, భూటాన్ మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ ఆశిస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని టోబ్గే ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.