తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ మే 10వ తేదీన TGలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తన పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన సుమారు రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.