జపాన్ పర్యటన ముగించుకొని శనివారం ప్రధాని మోదీ చైనా వెళ్లనున్నారు. చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రెండుసార్లు సమావేశం కానున్నట్లు సమాచారం. ఎస్‌సీవో సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ట్రంప్ 50శాతం సుంకాలు వేయడంతో పుతిన్- మోదీ, జిన్‌పింగ్-మోదీ చర్చలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.