భజన క్లబ్బింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని (VIDEO)

5చూసినవారు
సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భజన క్లబ్బింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పార్కులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని హిందూ భక్తి గీతాలను ఆలపించారు. ముందు వరుసలో కూర్చున్న ప్రధాని మోదీ శ్రీరాముడిపై పాడిన పాటకు అనుగుణంగా డఫ్లీ వాయిస్తూ తాళం వేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్న మోదీ.. భజన క్లబ్బింగ్‌ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్